ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రభుత్వం ఎందుకింత భయపడుతుంది? అని ప్రశ్నించింది. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేస్తే భయమెందుకు అవుతుంది? అని అడిగింది.
న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రభుత్వం ఎందుకింత భయపడుతుంది? అని ప్రశ్నించింది. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేస్తే భయమెందుకు అవుతుంది? అని అడిగింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కోసమే ఇండియా వచ్చారు, మళ్ళీ జ్యుడీషియల్ కస్టడీ ఎందుకు? అని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు జ్యుడీషియల్ కస్టడీ రిమాండ్ ప్రతిపాదనను విచారిస్తూ, సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఎవరూ ఎలాంటి తప్పు చేయనప్పుడు మీ ఫోన్ ఎవరు వింటే ఏమవుతుంది అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి అడిగారు. ప్రభాకర్ రావు విచారణకు సుప్రీం కోర్టు ఈ నెల 25 వరకు అనుమతిస్తూ, 26వ తేదీన ఆయనను విడుదల చేసి ఇంటికి పంపించాలని కూడా అదేశించింది. తదుపరి విచారణ జరిగే జనవరి 26వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకూ జరిగిన విచారణ ఒక లెక్క, ఇప్పటినుంచి జరగబోయే విచారణ మరో లెక్క అన్నట్లుగా జరుగుతుందని కొందరు భావిస్తున్నారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నసీనియర్ ఐపీఎస్ అధికారులతో జంబో సిట్ ను డీజీపీ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నోరు విప్పని ప్రభాకర్ రావు చేత ఈ స్పెషల్ టీం నిజాలు కక్కించే ఛాన్స్ ఉంది. పొలిటికల్ అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.