Supreme Court: 'చట్టాలు పాటించకపోతే దేశం విడిచి వెళ్లండి'.. మెటా, వాట్సాప్‌కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక!

Supreme Court: సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు మెటా, వాట్సాప్‌లకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Update: 2026-02-03 09:51 GMT

Supreme Court: సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు మెటా, వాట్సాప్‌లకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డేటా షేరింగ్ పేరుతో దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతతో (Privacy) చెలగాటం ఆడలేరని ధర్మాసనం తీవ్రంగా మందలించింది. నిబంధనలు పాటించని పక్షంలో దేశం నుంచి వెళ్ళిపోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అసలేం జరిగిందంటే?

వాట్సాప్ మరియు మెటా సంస్థల గోప్యతా విధానం (Privacy Policy) పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేలా ఉందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గతంలో ఈ సంస్థలపై భారీ అపరాధ రుసుము (Penalty) విధించింది. ఈ జరిమానాను సవాల్ చేస్తూ మెటా, వాట్సాప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం నిప్పులు చెరిగింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు:

గోప్యతకు భంగం: డేటా షేరింగ్ ముసుగులో పౌరుల ప్రైవసీని ఉల్లంఘించడాన్ని ఏమాత్రం అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.

చట్టమే సర్వోపరి: "భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే. ఈ దేశంలో వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడి రూల్స్ పాటించాలి. చట్టాలను గౌరవించని పక్షంలో మీరు దేశం నుంచి వెళ్లిపోవచ్చు" అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

సమాచార తస్కరణ: ప్రస్తుతం ఉన్న గోప్యతా విధానం కేవలం సమాచారాన్ని దొంగిలించేందుకు అనువుగా ఉందని, దీన్ని మార్చుకోవాల్సిందేనని ఆదేశించింది.

Tags:    

Similar News