PM Modi: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం
PM Modi: అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (Trade Deal) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ (NDA) ఎంపీలు ఘన సన్మానం చేశారు.
PM Modi: అమెరికాతో కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (Trade Deal) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ (NDA) ఎంపీలు ఘన సన్మానం చేశారు. మంగళవారం పార్లమెంట్ భేటీకి ముందు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీని ఎంపీలందరూ కలిసి అభినందించారు.
ట్రేడ్ డీల్‌తో కొత్త ఊపు: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ద్వైపాక్షిక ఒప్పందం కోసం ప్రధాని మోదీ చేసిన నిరంతర కృషి, దౌత్య వ్యూహాలను ఎంపీలు కొనియాడారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతులకు భారీ ఊతం లభిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ వ్యూహాలపై దిశానిర్దేశం: మరోవైపు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య సభను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఈ భేటీలో చర్చించారు. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సెషన్ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన కీలక సూచనలు చేశారు.