గాంధీ పేరు తొలిగింపు.. ఇవాళ,రేపు కాంగ్రెస్ నిరసనలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఇవాళ, రేపు ఏఐసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది టీకాంగ్రెస్‌.

Update: 2025-12-20 07:24 GMT

గాంధీ పేరు తొలిగింపు.. ఇవాళ,రేపు కాంగ్రెస్ నిరసనలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఇవాళ, రేపు ఏఐసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది టీకాంగ్రెస్‌. గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తోందని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్‌ నేతలు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్‌ నటరాజన్, మంత్రి అజారుద్దీన్‌, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్.

Tags:    

Similar News