KTR:"సిట్ విచారణలన్నీ రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్".. రూ.6 వేల కోట్ల టెండర్లపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

KTR: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2026-02-04 09:37 GMT

KTR: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సిట్ (SIT) విచారణలన్నీ ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని వెల్లడించారు. "దివాలా తీసిన ఒక ఇన్‌ఫ్రా సంస్థకు రూ. 6 వేల కోట్ల విలువైన టెండర్లు కట్టబెట్టారు. ఆ కంపెనీలో ముఖ్యమంత్రికే పెట్టుబడులు ఉన్నాయి. 2023లోనే దివాలా తీసిన కంపెనీకి టెండర్లు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది" అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలు చేయిస్తూ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి బినామీ వ్యవహారాలు బయటకు రాకుండా ఉండటానికే ఈ సిట్ విచారణల పేరుతో 'డైవర్షన్ గేమ్' ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ సోదాల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఇవ్వడంపై తాము న్యాయపోరాటం చేస్తామని, రేవంత్ రెడ్డి అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News