15th Finance Commission Funds: తెలంగాణ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్: 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల!

15th Finance Commission Funds: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Update: 2026-02-05 06:35 GMT

15th Finance Commission Funds: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మొదటి విడత కింద రూ. 259.36 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

రాష్ట్రానికి ఇంకా సుమారు రూ. 3,000 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని అంచనా. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు మార్గం సుగమం కానుంది.

Tags:    

Similar News