Jeevan Reddy: అవమానాలు భరించలేను.. ఆత్మగౌరవం ముఖ్యం.. కాంగ్రెస్ వీడటంపై జీవన్ రెడ్డి క్లారిటీ..!
Jeevan Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Jeevan Reddy: అవమానాలు భరించలేను.. ఆత్మగౌరవం ముఖ్యం.. కాంగ్రెస్ వీడటంపై జీవన్ రెడ్డి క్లారిటీ..!
Jeevan Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన రాజీనామాను అధికారికంగా సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానంపై మరియు రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత 20 నెలలుగా పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని, పదేపదే అవమానాలకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న తనకు గుర్తింపు లేకపోవడమే కాకుండా, తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా పరిణామాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాజీనామా నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రులు, పీసీసీ అధ్యక్షులు తనను కలిసినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం ఎవరూ చూపలేదని చెప్పారు. కేవలం 'ఓపిక పట్టండి' అని చెప్పడం తప్ప, తన కేడర్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం జరగలేదన్నారు.
తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. శాసనమండలిలో ఐదేళ్లపాటు ఒంటరి పోరాటం చేశానని, తన అర్హతను పార్టీ గుర్తించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ, ఖర్గేలకు గతంలోనే లేఖ రాశానని, కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని జీవన్ రెడ్డి వెల్లడించారు.
పార్టీని వీడుతున్నానే తప్ప రాజకీయాల నుండి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోనే ఉండి, రైతులు మరియు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
"నేను ఈ పార్టీని నిర్మించాను.. కానీ ఎవరో వచ్చి ఆక్యూపై చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను" అని చెబుతూ, తన నిర్ణయం వెనుక ఉన్న బాధను వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌ను పట్టించుకోనని, రేపు అసెంబ్లీలో (ప్రజాక్షేత్రంలో) అన్ని విషయాలు తేలుస్తానని సవాల్ విసిరారు.