Pargi: పరిగిలో ఈద్ సంబరాలు.. విందులో పాల్గొన్న డీఎస్పీ
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ABS ప్లాజాలో మాజీ డిప్యూటీ సర్పంచ్ అబ్దుల్ బషీర్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Pargi: పరిగిలో ఈద్ సంబరాలు.. విందులో పాల్గొన్న డీఎస్పీ
పరిగి: రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ABS ప్లాజాలో "ఈద్ మిలాప్" వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మాజీ డిప్యూటీ సర్పంచ్ అబ్దుల్ బషీర్, పరిగి మసీదు కమిటీ సదర్ అబ్దుల్ మోయిజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ విందులో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు,పట్టణ ప్రముఖులు స్థానిక పోలీస్ అధికారులు విశిష్ట అతిథులుగా హాజరయ్యాయి ,ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ పండుగలు మనుషుల మధ్య ప్రేమను, ఐక్యతను పెంపొందించాలని, పరిగిలో కొనసాగుతున్న గంగా-జమున తహజీబ్ (మతసామరస్యం) ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.వచ్చిన అతిథులందరికీ రంజాన్ ప్రత్యేక విందును వడ్డించారు. ఈ కార్యక్రమంలో పరిగి డిఎస్పి శ్రీనివాస్, ఎస్సై, పరిగి ఎమ్మార్వో, అధికారులు, పరిగి మున్సిపల్ చైర్మన్,పరిగి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.