Karimnagar: ధరణి పోయింది.. భూభారతి వచ్చింది.. కానీ భూ సమస్య తీరిందా?
Karimnagar: ధరణి 2020 నుండి భూభారతి 2025 వరకు భూ సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ విమర్శించారు.
Karimnagar: ధరణి పోయింది.. భూభారతి వచ్చింది.. కానీ భూ సమస్య తీరిందా?
Karimnagar: నాటి ధరణి 2020 నుంచి నేటి భూభారతి 2025 వరకు ఉన్న భూ సమస్యలు పరిష్కారం అయినాయా అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెవిన్యూ చట్టాలైన 1971 ఆర్ఓఆర్ యాక్ట్ ను రద్దు పరచి ధరణి 2020 ని తీసుకురావడం వలన గత ప్రభుత్వం ఒక విధానంతో నడుస్తున్న రెవెన్యూ వ్యవస్థను అగాధంలోకి నెట్టి వేయడం జరిగిందన్నారు.
భూ కబ్జాలకు తెర లేపింది గత ప్రభుత్వం..
లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి పంపించి రైతులను ప్రజలను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూములను జనరల్ కేటగిరిగా మార్చి భూకబ్జాలకు ఆస్కారం గత ప్రభుత్వం కల్పించిందన్నారు.
దీనివలన కోట్ల రూపాయల భూ కుంభకోణాలు జరిగాయన్నారు. భూ సమస్యలతోని కొద్దిమంది రైతులు చనిపోవడం జరిగింది.లక్షలాదిమంది రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేశారి గత ప్రభుత్వాన్ని మార్చి వేశారు. అప్పటి భూ సమస్యలు ఇప్పటి భూభారతి 2025 వచ్చినంక కూడా సంపూర్ణంగా పరిష్కరించబడలేదు, ఇప్పటికీ ఇంకా రైతులు ప్రజలు రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని తెలిపారు.
నాటి నుండి నేటి వరకు భూ సమస్యలు అలాగే ఉన్నాయి..
దీనికి తోడు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సూచనల నిషేధిత జాబితాను ప్రస్తుత పరచుమని అంటే రెవెన్యూ గైడ్ లెన్స్ కు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఇళ్లను, 9 లక్షల ఓపెన్ ప్లాట్లను, కరీంనగర్ పట్టణంలో 4,500 ఇళ్లను నిషేధిత జాబితాలోకి పంపడం జరిగింది. ఉన్న సమస్యలే ఉండిపోగా లేని సమస్యలను తల భారానికి వచ్చాయన్నారు.
ఈ చర్య వలన ఇటు ప్రజలు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆగమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఇది ఎంతటి అవినీతికి దారితీస్తుందో తెలవదు అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వారి ముందు ఉన్న ప్రశ్న.
ఆనాటి ధరణి నుంచి నేటి భూభారతి వరకు సమస్యలు పరిష్కారం అయినాయా లేవా అనే దానిమీద ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును కరీంనగర్ లో త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో నాయకులు ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, చామనపల్లి లక్ష్మి, పున్నం జగదీష్, మంద మధుకరణ్, మహాదేవుని భార్గవి, గొర్రె రాజయ్య, సంధ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.