PV Expressway: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
PV Expressway: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 దగ్గర మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
PV Expressway: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 దగ్గర మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైనవారిని వారిని ఆస్పత్రికి తరలించారు. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.