Suryapet Custodial Death: కస్టడీ డెత్ కేసులో పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. కోదాడ రూరల్ సీఐ సస్పెండ్
Suryapet Custodial Death: సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్, హుజూర్ నగర్ జైలులో అస్వస్థతకు గురై మృతి చెందడం కలకలం రేపింది.
Suryapet Custodial Death: కస్టడీ డెత్ కేసులో పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. కోదాడ రూరల్ సీఐ సస్పెండ్
Suryapet Custodial Death: సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్, హుజూర్ నగర్ జైలులో అస్వస్థతకు గురై మృతి చెందడం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కస్టడీ డెత్ కేసులో పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కోదాడ రూరల్ సీఐ లింగంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రిమాండ్‌కు ముందే పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే అతను మృతి చెందాడని బంధువులు, ప్రజా సంఘాలు ఆరోపణలు చేశాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ మృతుడి తల్లి లలితమ్మతో కలిసి పక్కా ఆధారాలతో డీజీపీకి మెమోరాండం సమర్పించారు. బాధ్యులైన పోలీసులపై మర్డర్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజేష్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.