Amani: బీజేపీలో చేరిన ప్రముఖ నటి ఆమని
Amani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు.
Amani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాంచందర్‌రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఈ సందర్భంగా ఆమని పేర్కొన్నారు.