Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్‌రావు కస్టడీ 25 వరకు పొడిగింపు

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్‌ దూకుడు పెంచింది.

Update: 2025-12-20 07:28 GMT

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్‌ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును నేటి నుంచి మరోసారి విచారించనున్నారు సిట్ అధికారులు. ఇందులో భాగంగా.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ క్రైమ్ స్టేషన్‌లోనే సిట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. సీసీఎస్‌ ఆఫీస్‌కు ప్రభాకర్‌రావును తరలించి.. అక్కడే విచారించనుంది సిట్ బృందం.

నిన్న సుప్రీంకోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విచారణ జరిగింది. కస్టడీ సమయంలో ప్రభాకర్‌ తమకు సహకరించలేదని, మరికొన్ని రోజులు విచారించాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. మరో వారం రోజులు కస్టడీకి అనుమతివ్వాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు.. ప్రభాకర్‌రావు కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగించింది.

Tags:    

Similar News