మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీపైనే చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ 53వ పుట్టిన రోజుని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు.

Update: 2025-12-21 05:36 GMT

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ 53వ పుట్టిన రోజుని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. రెండు రోజుల నుంచి కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలోని శేరిలింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన కటౌట్ పైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) ఫొటోలు ఉన్నాయి. దాంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కటౌట్‌పై ‘హ్యాపీ బర్త్‌డే జగనన్న’ అని ఉంది. రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టే.. వైఎస్ జగన్ పుట్టిన రోజు కటౌట్‌లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఏర్పాటు చేశారని జనం అనుకుంటున్నారు. భారీ సైజ్ లో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల బెంగళూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్, కేటీఆర్ కలిసిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 

Tags:    

Similar News