తెలంగాణలో కరోనా పంజా.. కొత్తగా 499 కేసులు
తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న (గురువారం) ఒక్క రోజే అత్యధికంగా 352 కేసులు నమోదు కాగా.. నేడు కూడా అత్యధికంగా 499 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 329 కేసులు నమోదు చేసుకున్నాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 198 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6526 కి చేరింది.ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 3352 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2976 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 13,586 కేసులు నమోదు కాగా, 336 మంది ప్రాణాలు విడిచారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,80,532 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,63,248 ఉండగా, 2,04,710 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 12,573 మంది కరోనా వ్యాధితో మరణించారు.