Parigi: ప్రాణం పోయినా భూమి వదలం! పోలీసులతో రైతుల వీరోచిత పోరాటం!

Parigi: వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రైతుల ఆగ్రహం. రాపోల్, కడ్లాపూర్ రైతుల భారీ ధర్నా మరియు పోలీసులతో ఘర్షణ.

Update: 2026-03-26 08:15 GMT

Parigi: ప్రాణం పోయినా భూమి వదలం! పోలీసులతో రైతుల వీరోచిత పోరాటం!

వికారాబాద్ జిల్లా: పరిగిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిర్ణయంపై పరిగి మండలం రాపోల్, కడ్లాపూర్ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణం పోయినా సరే.. భూములను వదులుకోబోమని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే వందలాది మంది రైతులు, మహిళలు కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లేకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ధర్నా విరమించాలని రైతులకు సూచించారు. రైతులు వినకపోవడంతో, వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు,రైతుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళా రైతులు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకుని, అరెస్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది రైతులను పోలీసులు ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది.

Tags:    

Similar News