Midday Meals: సర్కార్ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్: మధ్యాహ్న భోజనంలో ఇకపై 'చేపల కూర'!

Midday Meals: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది.

Update: 2026-03-26 09:03 GMT

Midday Meals: సర్కార్ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్: మధ్యాహ్న భోజనంలో ఇకపై 'చేపల కూర'!

Midday Meals: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మధ్యాహ్న భోజన మెనూలో చేపల కూరను (Fish Curry) చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేశారు.

మధ్యాహ్న భోజన పథకంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే సన్నబియ్యం, గుడ్లు అందిస్తుండగా, ఇకపై వారంలో నిర్ణీత రోజుల్లో చేపల కూరను వడ్డించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

చేపల్లో ముల్లుల వల్ల పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 'తిలాపియా' (Tilapia) అనే ప్రత్యేక రకం చేపలను పెంచనున్నారు. ఈ చేపకు కేవలం మధ్యలో ఒకటే వెన్నుముల్లు ఉండటం వల్ల విద్యార్థులు సులభంగా, సురక్షితంగా తినవచ్చని మంత్రి వివరించారు. విద్యార్థుల అవసరాల కోసం ఈ తిలాపియా చేపలను ప్రభుత్వం ప్రత్యేకంగా పెంపకం చేపట్టి సరఫరా చేయనుంది.

రాష్ట్రంలో పశుసంపద బలంగా ఉందని, ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి శ్రీహరి గుర్తుచేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారికి నాణ్యమైన ప్రోటీన్ అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విద్యనే కాకుండా, గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News