Armoor: విద్యార్థినుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమం!

Armoor: ఆర్మూర్ రోటరీ క్లబ్ మరియు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో 15 పాఠశాలల విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్స్ పంపిణీ.

Update: 2026-03-26 11:19 GMT

Armoor: విద్యార్థినుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమం!

ఆర్మూర్ న్యూస్: పట్టణ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో పునర్వి నియోగ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం జడ్పీహెచ్ఎస్ బాయ్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనెలహరి రఘు, విచ్చేశారు, అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ కి బొకే శాలువా తో ఘనంగా సన్మానించారు, సుమారు ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మండలంలోని 15 పాఠశాలలో నుంచి 1049 మంది పిల్లలు కు ఒక సంవత్సరం పాటు వినియోగించే పునర్వి నియోగ సానిటరీ ప్యాడ్స్ ప్యాకెట్స్ వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, సైన్స్ టీచర్లకు, గోనెలహరి, రోటరీ క్లబ్ ప్రతినిధులు చేతుల మీద అందజేయడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పిల్లలు మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని, మాట్లాడుతూ మంచిగా చదువుకొని, మంచిగా ర్యాంకు తెచ్చుకొని పాఠశాల యొక్క పేరు నిలబెట్టాలన్నారు, కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News