Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ సెగ.. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ!

Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత. బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండలాల్లోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు.

Update: 2026-03-26 10:39 GMT

Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ సెగ.. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ!

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండలాల్లో ఉన్న హెచ్‌పి (HP), ఇండియన్ ఆయిల్, బిపి (BP), మరియు జియో పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాన కంపెనీల బంకులన్నీ మూతపడటంతో వాహనదారులు చుట్టుపక్కల ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. వ్యవసాయ పనులకు డీజిల్ అవసరం ఉన్న రైతులు కూడా బంకుల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News