Revanth Reddy: ఎంఎంటీఎస్ సేవలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

MMTS Services: హైద‌రాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2026-03-26 11:50 GMT

Revanth Reddy: ఎంఎంటీఎస్ సేవలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy Reviews MMTS Services: హైద‌రాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల త‌గ్గుముఖంపై ఆయన ఆరా తీశారు. ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో రేవంత్ స‌మీక్ష నిర్వహించారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్రమంత‌ప్పకుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులు న‌డ‌పాల‌ని సీఎం ఆదేశించారు.

ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉన్నందున అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News