Karimnagar: కరీంనగర్ 24వ డివిజన్‌లో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ
Karimnagar: కరీంనగర్ 24వ డివిజన్‌లో బీజేపీ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి.
Karimnagar: కరీంనగర్ 24వ డివిజన్‌లో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని 24వ డివిజన్ లోని హనుమాన్ దేవాలయం సమీపంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.
ప్రతి డివిజన్లో బిజెపి జెండాలు ఎగరాలి.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొదటిసారి కరీంనగర్ బిజెపి జెండా ఎగరడంతో నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహం నిండిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి డివిజన్లో బిజెపి మార్కు కనిపించాలి.
నమ్మకంతో మనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించి ఈ మరింత చేరువ కావాలని అన్నారు. ప్రతి పనిలో డివిజన్లో బిజెపి మార్క్ కనిపించాలి.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు తో పాటు, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 24వ డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ రెడ్డి, బిజెపి నాయకులు, డివిజన్ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.