Karimnagar: భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ప్రత్యేక ఏర్పాట్లు

Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచల సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాల బుకింగ్ సౌకర్యం.

Update: 2026-03-26 13:44 GMT

Karimnagar: భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ప్రత్యేక ఏర్పాట్లు

కరీంనగర్: ఆర్టీసీ కార్గో పార్సెల్ ద్వారా భద్రాచల సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలను అందించడానికి ఏర్పాటు చేశారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టీసీ కార్గో ద్వారా బద్రాచల సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలను బుక్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆర్టీసీ కార్గో సిబ్బందికి నగదును చెల్లించి ముత్యాల తలంబ్రాలను బుక్ చేసుకున్నారు.

కార్గో ద్వారా ఇంటికే ముత్యాల తలంబ్రాలు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజు మాట్లాడుతూ భద్రాచలం వెళ్లలేని వారు స్వామివారి తలంబ్రాలు కావలసినవారుట నగదును చెల్లించి బుక్ చేసుకున్న వారికి రాములోరి తలంబ్రాలు అందిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అవసమైన మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది గాని ప్రజలు గానీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల కార్లో కౌంటర్ ను సంప్రదించి బుక్ చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్గో ఏర్పాట్లు చేసిన ఈ అవకాశం సద్వినియోగం చేస్కోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలందరికి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్టీసీ కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News