Karimnagar: చలో అసెంబ్లీ బ్రేక్.. కరీంనగర్‌లో నేతల గృహనిర్బంధం!

Karimnagar: కరీంనగర్‌లో జి. తిరుపతి హౌస్ అరెస్ట్. చలో అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడంపై ఆగ్రహం. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్.

Update: 2026-03-26 12:04 GMT

Karimnagar: చలో అసెంబ్లీ బ్రేక్.. కరీంనగర్‌లో నేతల గృహనిర్బంధం!

కరీంనగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలి, రాజీవ్ యువ వికాస్ పథకం అర్హులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేసి ఇవ్వాలని, చలో అసెంబ్లీని ముట్టడిని పిలిపిస్తే తనను ఈరోజు తెల్లవారుజామన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని రాష్ట్ర ఉపాధ్యక్షులు జి తిరుపతి తెలిపారు. అసెంబ్లీలో ఉద్యోగ భర్తీ నియామకాల గురించి చర్చించకుండా అసెంబ్లీని అధికార పక్షం ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఓట్లతో అధికారంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము నేడు ఉద్యోగ నియామకాలు జరపకుండా నిరుద్యోగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్వరాష్ట్రలో నాటి నుండి నేటి వరకు అరెస్టులు నిర్బంధాలు.

శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడిన పిలిపిస్తే పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పోలీసులతో ఎన్ని అక్రమ అరెస్టులు నిర్బంధాలు ప్రభుత్వాలు చేసిన పోరాటాలను ఆపలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో నాటినుండి నేటి వరకు అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేయడం సిగ్గుచేటువని ఆయన అన్నారు. ఇప్పటికైనా రెండు లక్షల ఉద్యోగాలకే నోటిఫికేషన్ విడుదల చేసి యువతకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోలీసుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News