Peddapalli: సర్కారు బడికి కార్పొరేట్ చేయూత!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఇస్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రూ. 2 లక్షల విద్యా సామాగ్రి వితరణ. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఎంఈవో మహేశ్ వ్యాఖ్య.
Peddapalli: సర్కారు బడికి కార్పొరేట్ చేయూత!
పెద్దపల్లి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈవో సిరిమల్ల మహేశ్ మరియు మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఇస్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్‌కార్న్ సొల్యూషన్ సంస్థ (పెద్దపల్లి బ్రాంచ్) సౌజన్యంతో రూ. 2 లక్షల విలువైన విద్యా సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉన్నాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇన్ఫినిటీ ఫిన్‌కార్న్ సంస్థ చేసిన ఈ సాయం ఇతర సంస్థలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.