Tandur: బీదర్ టు తాండూరు.. కల్తీ అల్లం గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్
Tandur: తాండూరులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయాల గుట్టురట్టు. బీదర్ కేంద్రంగా సాగుతున్న తయారీపై వికారాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు.
Tandur: బీదర్ టు తాండూరు.. కల్తీ అల్లం గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్
Tandur: తాండూరు పట్టణంలో పాత కూరగాయల మార్కెట్‌లో రేపాల శ్రీధర్ అనే వ్యాపారి కల్తీ అల్లం విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాష బృందం దాడులు నిర్వహించారు. వ్యాపారి నుంచి 40 కేజీల కల్తీ అల్లం స్వాదీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకవస్తున్నారని విచారించగా కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన యర్రమల్లి గిరిధర్ అనే వ్యక్తి తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
వెంటనే బీదర్‌లోని అతని హోల్‌సేల్ షాపుపై దాడి చేసి, అక్కడ నిల్వ ఉంచిన మరో 560 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. వారితో పాటు కల్తీ అల్లం రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని(KA 39 9028) కూడా సీజ్ చేశారు. ఈ మేరకు నిందితులు యర్రమల్లి గిరిధర్ (తయారీదారు, బీదర్), రేపాల శ్రీధర్ (విక్రేత, తాండూరు)లపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ, లాభార్జనే ధ్యేయంగా కల్తీ పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.