Karimnagar: న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు.. అలెంబిక్ మేనేజ్‌మెంట్‌కు హెచ్చరిక!

Karimnagar: అలెంబిక్ ఫార్మా వేధింపుల వల్ల మరణించిన మెడికల్ రిప్ అఖిలేష్‌కు న్యాయం చేయాలని కరీంనగర్‌లో TMSRU భారీ క్యాండిల్ లైట్ ర్యాలీ.

Update: 2026-03-25 14:59 GMT

Karimnagar: న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు.. అలెంబిక్ మేనేజ్‌మెంట్‌కు హెచ్చరిక!

Karimnagar: అలెంబిక్ ఫార్మా యాజమాన్యం వేధింపుల వల్ల మరణించిన మెడికల్ రిప్రజెంటేటివ్ జె. అఖిలేష్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో పని చేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ భారీ క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెడికవర్ హాస్పిటల్ (డాక్టర్ స్ట్రీట్) నుండి గర్ల్స్ కాలేజీ చౌరస్తా వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు.

మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం..

ఈ ర్యాలీని ఉద్దేశించి TMSRU రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. విద్యాసాగర్ మాట్లాడుతూ.. అలెంబిక్ మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక వ్యాపార విధానాలే అఖిలేష్ బలి కావడానికి కారణమని ఆరోపించారు. మృతికి కారణమైన వారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని అలాగే పోలీస్ లు నిస్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని , అలాగే బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఫార్మ యాజమాన్యాలు..

అలాగే ఫార్మా రంగంలో సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, కార్మిక చట్టాలను ఉల్లంగిస్తున్న ఫార్మా యాజమాన్యలను కఠినంగా శిక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ కి కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్దమైన పని విధానాలను రూపొందించాలని కోరారు ఈ కార్యక్రమంలో TMSRU రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎ. సదానందాచారి పాల్గొని ప్రసంగించారు. రిటైర్డ్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ (RSPEAT) అధ్యక్షులు P మురళి పాల్గొని సంఘీభావం ప్రకటించారు

ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె. వెంకటేశ్వర్లు, పి. హరీష్, ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి పి. నరేందర్ మరియు అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొని అఖిలేష్‌కు నివాళులర్పించారు.

Tags:    

Similar News