Karimnagar: నేరస్తుల గుండెల్లో రైళ్లు.. సీపీ సీరియస్ వార్నింగ్!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ గౌష్ ఆలం నేర సమీక్షా సమావేశం. పెండింగ్ కేసులు, పోక్సో మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా.

Update: 2026-03-25 14:39 GMT

Karimnagar: నేరస్తుల గుండెల్లో రైళ్లు.. సీపీ సీరియస్ వార్నింగ్!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలునందు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధ్యక్షతన నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో అధికారులు అందరూ తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలను (CD Files) సమర్పించి, కేసుల పురోగతిని వివరించారు. కమీషనరేట్ లోని శాంతిభద్రతలు తీసుకోవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

​సమావేశంలోని ముఖ్య అంశాలు:

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ,పెండింగ్ కేసుల సమీక్ష (UI Cases): 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు మరియు ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల (Grave Crimes) ప్రస్తుత స్థితిగతులను సమీక్షించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీపీ ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి..

​సైబర్ నేరాలు, సాంకేతికత సైబర్ క్రైమ్ రిపోర్టింగ్, 'సీఐఆర్' (CEIR) పోర్టల్ వినియోగం మరియు సీసీటీవీ కెమెరాల జియో-ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు . ప్రజల నుండి వచ్చే ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీపీ అధికారులకు సూచించారు.

స్మగ్లింగ్, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి..

​మాదకద్రవ్యాలు & అక్రమ రవాణా ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద డ్రగ్స్ నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా, మరియు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచాలి..

​ట్రాఫిక్ & రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత..

ప్రజవాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చేయాలన్నారు. కలెక్టర్ ప్రజావాణి మరియు పోలీస్ కమిషనరేట్ ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే దిశగా అధికారులు ప్రయత్నం చేయాలి అన్నారు.

​ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీష్ లతోపాటు సీఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.

Tags:    

Similar News