Karimnagar: ఇంధన కొరత లేదు.. సీపీ సీరియస్ వార్నింగ్!

Karimnagar: కరీంనగర్‌లో ఇంధన కొరత లేదని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని, బంకుల్లో తగినంత స్టాక్ ఉందని వెల్లడించారు.

Update: 2026-03-25 12:14 GMT

Karimnagar: ఇంధన కొరత లేదు.. సీపీ సీరియస్ వార్నింగ్!

Karimnagar: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

​కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ​ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి కొరత లేదు.

సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దు..

​సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని కమిషనర్ హెచ్చరించారు.

​"ప్రజలు శాంతంగా ఉండాలి. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవు, కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా సీపీ హెచ్చరించారు .

Tags:    

Similar News