Kondagattu: శ్రీరామనవమికి కొండగట్టు సిద్ధం భక్తి శోభలో అంజన్న క్షేత్రం!
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం.
Kondagattu: శ్రీరామనవమికి కొండగట్టు సిద్ధం భక్తి శోభలో అంజన్న క్షేత్రం!
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం… శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శోభతో ముస్తాబవుతోంది. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిల్లు రంగురంగుల దీపాలతో, పుష్పాలంకరణలతో సింగారమై భక్తులను ఆహ్వానిస్తోంది.
శ్రీరాముని జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వ హించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రామనామ స్మరణతో ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
దూరదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముండడంతో, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉండగా, శ్రీరామ నవమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు, రామపట్టాభిషేకం, సీతారామ కళ్యాణం వంటి వైభవోత్సవాలు నిర్వహించనున్నారు. కొండగట్టు క్షేత్రం భక్తజనాలతో కళకళలాడేందుకు సిద్ధమవుతోంది.