తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా బూర్గుల రామకృష్ణాభవన్‌లో కరోనా కలకలం చోటుచేసుకుంది.
బీఆర్కే భవన్‌లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏడో అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది అంతా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. ఎనిమిదో అంతస్తు ఆర్థిక శాఖలోనూ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీ ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నారు.