రిటైర్డ్ న్యాయమూర్తికే పింఛన్ ఇవ్వట్లేదు : జస్టిస్ జి.శ్రీదేవి
పెన్షన్ కోసం మాజీ హైకోర్ట్ జడ్జి న్యాయ పోరాటం చేపట్టింది. రిటైర్డ్ అయ్యి 3ఏళ్లు అవుతున్నా తనకు పూర్తి పెన్షన్ అందండం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
పెన్షన్ కోసం మాజీ హైకోర్ట్ జడ్జి న్యాయ పోరాటం చేపట్టింది. రిటైర్డ్ అయ్యి 3ఏళ్లు అవుతున్నా తనకు పూర్తి పెన్షన్ అందండం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్‌లో రిటైర్డ్ అయిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి.. తనకు పూర్తి పెన్షన్ మంజూరు చేయడంలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి పెన్షన్ మంజూరు ప్రక్రియను ప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోపు ఆ వివరాలను కోర్టుకు తెలపాలని అధికారులకు సూచించింది.