జూబ్లీహిల్స్‌లో డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ అండ్ బ్లడ్‌గ్లాసెస్ పుస్తకావిష్కరణ
జూబ్లీహిల్స్‌లో డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ త్రూ లెన్స్ అండ్ బ్లడ్ గ్లాసెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
జూబ్లీహిల్స్‌లో డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ త్రూ లెన్స్ అండ్ బ్లడ్ గ్లాసెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని జ్వాల నర్సింగరావు రచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నేషనల్ హ్యుమన్ రైట్స్ చైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సురభి వాణి, టీ. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంట చక్రపాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు హాజరయ్యారు.
ఇండియా డెమోక్రసీ, ఇతర అంశాలపై ఈ పుస్తకంలో ప్రధానంగా రాశారన్నారు నేషనల్ హ్యూమన్ కమిషన్ రైట్స్ చైర్మన్. డెమోక్రసీ, గవర్నెన్స్‌లో జ్యుడీషియరీ, లెజిస్లేషన్, బ్యూరోక్రాట్స్ కీలకమని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియన్ డెమోక్రసీ గొప్పదని ఆయన ప్రస్తావించారు.
సమాజానికి అవసరమైన అంశంపై జ్వాల నర్సింహరావు పుస్తకం రాశారని కొనియాడారు మంత్రి శ్రీధర్‌బాబు. డెమోక్రసీపై ఆయన విశ్లేషణ చేసి బుక్ రాశారని అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు.. డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శ్రీధర్‌బాబు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలతో పోల్చుకుంటే భారత డెమోక్రసీ సిస్టం గొప్పదని శ్రీధర్‌బాబు అన్నారు.
జ్వాల నర్సింహారావు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే సురభి వాణి. డెమోక్రసీ మీద బుక్ రాయడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు. అందరికి విద్య అవసరం.. విద్య ఒక్కటే అన్నింటికి సమాధానం చెబుతోందని ఎమెల్సీ సురభివాణి వ్యాఖ్యానించారు.