Coronavirus Live Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..నిన్న ఒక్కరోజే 230మందికిపైగా నిర్ధారణ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకి తన పంజా విసురుతుంది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.

Update: 2020-03-31 07:00 GMT
Coronavirus live updates (representational image)

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకి తన పంజా విసురుతుంది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 200కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 11 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు కేంద్రం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,251కి చేరింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 35కు చేరుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా తొమ్మిది మంది చనిపోగా, గుజరాత్ లో ఏడుగురు మంది చనిపోయారు. ఇక తెలంగాణలో కొత్తగా ఆరుగురిలో కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. ఆరుగురు మృతి చెందారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23కు చేరింది.. సోమవారం రోజునాటికి కేరళలో అత్యధికంగా 32 కేసులు నమోదు అయ్యాయి..

పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది..

మహారాష్ట్ర 238, కేరళ 234, ఢిల్లీ 97, ఉత్తరప్రదేశ్‌ 96, కర్ణాటక 91,లడఖ్ 13, తెలంగాణ 77, రాజస్థాన్ 79, జమ్మూ కశ్మీర్‌ 49, గుజరాత్ 70, ఆంధ్రప్రదేశ్ 23, తమిళనాడు 67, మధ్యప్రదేశ్ 47, పంజాబ్ 41, హర్యానా 36, పశ్చిమ్ బెంగాల్ 22, బీహార్ 15, అండమాన్ నికోబార్ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,100 కేసుల్లో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఏడు లక్షలకి చేరుకున్నాయి. 35 వేల మందికి పైగా చనిపోయారు.

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూపే భారతదేశ పటం! Full View ప్రస్తుతం కరోనా కేసుల వివరాలు రాష్ట్రాల వారీగా.. Full View
Live Updates
2020-03-31 17:06 GMT

గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సీఎం కేజ్రివాల్ అన్నారు. ఇప్పటికి ఢిల్లీలో 97 కేసులు నమోదు కాగా, అందులో 41 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అన్నారు.-పూర్తి కథనం  

2020-03-31 16:48 GMT

ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వీరు కూడా ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యాయని తెలిపింది.-పూర్తి కథనం  

2020-03-31 16:33 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో క‌రోనా కేసు న‌మోద కావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.-పూర్తి కథనం  

2020-03-31 16:31 GMT

బాలీవుడ్ గాయనీ క‌నికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు.-పూర్తి కథనం 

2020-03-31 16:30 GMT

కరోనా వైరస్ రోజురోజుకు తన ప్రభావం చూపుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ సంఖ్య తగ్గడం లేదు.. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కు చేరింది.-పూర్తి కథనం  

2020-03-31 10:53 GMT

మర్కజ్ ప్రార్థనలు.. నిజామాబాద్ జిల్లాలోనూ కలకలం రేపుతున్నాయి. జిల్లా నుంచి సుమారు 39 మంది ప్రార్థనలకు హాజరైనట్లు లెక్కించారు. దీంతో వారందరినీ క్వారంటైన్‌ కు తరలించారు.-పూర్తి కథనం  

2020-03-31 10:51 GMT

అతడు కరోనాను జయించాడు. అవును నిజంగా కరోనా మహమ్మరి పై గెలిచాడు. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులున్నప్పటికీ కేరళ వాసి కరోనా నుంచి కోలుకున్నాడు.-పూర్తి కథనం 

2020-03-31 08:51 GMT

కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ కట్టడికి సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతులతో మహమ్మారిని తరిమికొట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 'కోవిడ్19 అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌'తో ముందుకొచ్చింది. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలను గుర్తించడానికి సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది.-పూర్తి కథనం 

2020-03-31 08:37 GMT

కరోనా మరింత కలకలం రేపింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 6 కు చేరుకుంది. వీరంతా కూడా ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్ళిన వారేకావడం గమనార్హం. దాదాపుగా 2000 మంది ఢిల్లీలోని మర్కాజ్ లో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్నారు.-పూర్తి కథనం 

2020-03-31 08:36 GMT

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు. ఇప్పటిదాకా దాని బారిన పడి 37వేలమంది బలయ్యారు.1,50,732మంది ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ అతలాకులమవుతోంది.-పూర్తి కథనం  

Tags:    

Similar News