Top
logo

Coronavirus: కరోనా విలయతాండవం.. 50 మంది డాక్టర్లు బలి

Coronavirus: కరోనా విలయతాండవం.. 50 మంది డాక్టర్లు బలి
X
Representational Image
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు. ఇప్పటిదాకా దాని బారిన పడి 37వేలమంది బలయ్యారు.1,50,732మంది ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ అతలాకులమవుతోంది. కరోనా కేసులు నమోదు లో చైనా ను మించిపోయింది. ఇటలీలో కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షపైగా చేరుకుంటే.. మరణాల సంఖ్య 11,591కి చేరుకుంది.

ఇక కరోనా రోగులకు ట్రీట్​మెంట్​ చేస్తున్న వైద్యులు దీనికి బలవుతున్నారు. ఒక్క ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనా కారణంతో మరణించినట్లు నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఆర్డర్స్​ ఆఫ్​ సర్జన్స్​ అండ్​ డెంటిస్ట్స్​ ప్రెసిడెంట్​ ఫిలిపో అనేలి వెల్లడించింది. అందులో 17 మంది వైద్యులు ఎక్కువ ఎఫెక్ట్​ ఉన్న లొంబార్డి రీజియన్​కు చెందిన వారేనని తెలిపింది. ఇప్పటిదాకా దాని బారిన పడి 37,615 మంది బలయ్యారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్​లోనే నమోదయ్యాయి.


Web TitleCoronavirus Updates 50 Doctors have died on Italy with Coronavirus
Next Story