నాగర్‌కర్నూల్‌లో కరోనా కలకలం.. పరీక్షలో ఒకరికి పాజిటివ్

X
Highlights
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా కేసు నమోద కావటం కలకలం ...
Arun Chilukuri31 March 2020 11:42 AM GMT
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా కేసు నమోద కావటం కలకలం రేపుతోంది. కాగా, జిల్లాలోనే ఇది కరోనా తొలికేసుగా జిల్లా డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్ అధికారికంగా వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజ్ భవన్‌లో జరిగిన మత ప్రార్థనలకు జిల్లా నుంచి 11 మంది వెళ్లినట్లు ఆయన తెలిపారు.
వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా, మరో 9 మందికి నెగిటివ్ వచ్చింది. మరొకరి ఫలితం రావాల్సి ఉంది. ఇక జిల్లాలో యూకే నుంచి వచ్చిన తల్లీబిడ్డలు జ్వరంతో బాధపడుతున్నారు. వారిద్దరి శాంపిల్స్‌ను కూడా సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సుధాకర్ లాల్ తెలిపారు.
Web Titlecoronavirus one tested positive in Nagar Kurnool district
Next Story