ప్రార్థనలకు వెళ్లి వచ్చి మృత్యుఒడికి.. తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతులు!

ప్రార్థనలకు వెళ్లి వచ్చి మృత్యుఒడికి.. తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతులు!
x
Highlights

కరోనా మరింత కలకలం రేపింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 6 కు చేరుకుంది. వీరంతా కూడా ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్ళిన వారేకావడం గమనార్హం. దాదాపుగా 2000...

కరోనా మరింత కలకలం రేపింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 6 కు చేరుకుంది. వీరంతా కూడా ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్ళిన వారేకావడం గమనార్హం. దాదాపుగా 2000 మంది ఢిల్లీలోని మర్కాజ్ లో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్నారు. మార్చి 1 నుంచి 15 వరకు దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగ్‌-ఏ-జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు ఇండోనేషియా, ధాయలాండ్, మలేసియా వంటి ఆసియా దేశాలకు చెందినవారు ఈ ప్రార్థనలకు హాజరు అయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 500 మందికి పైగా ఈ ప్రార్థనలలో పాల్గోవడానికి వెళ్ళగా వారిలో తెలంగాణ నుంచి మొత్తం 280 మంది ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 186 మంది వెళ్లగా.. నిర్మల్ 11, ఆదిలాబాద్ 10, నిజామాబాద్ 18, మెదక్ 26, రంగారెడ్డి 15, ఖమ్మం 15, వరంగల్ 25, నల్గొండ 21, కరీంనగర్ 17, భైంసా 11 మంది చొప్పున వెళ్లారని సమాచారం. తెలంగాణా నుంచి ఈ ప్రార్థనలలో పాల్గొని వచ్చిన వారిలో ఆరుగురు ఇప్పటివరకూ మృత్యువాత పడటం విషాదకరం, గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, గ్లోబల్ హాస్పిటల్లో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో మరొకరు కరోనా బారిన పది మృతి చెందారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం మృతుల్లో పాత బస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రార్ధనలలో పాల్గొని వచ్చిన వారిని.. వారిని కాంటాక్ట్ అయిన వారినీ క్వారంటైన్ లో ఉంచాలని తెలంగాణా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

అప్రమత్తం అయిన తెలంగాణా ప్రభుత్వం..

ఈ విషయం పట్ల తెలంగాణా ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని తెలిపింది. కాబట్టి నిజాముద్దీన్‌ మర్కజ్‌ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని, వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని కోరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories