Congress: రాయ్‌బరేలీ నుండి రాహుల్, అమేథీ నుండి కేఎల్ శర్మ.. మరోసారి పోటీకి దూరంగా ప్రియాంక...

Congress: గాంధీ కుటుంబానికి పట్టున్న రెండు నియోజకవర్గాల్లో పోటీపై స్పష్టత వచ్చింది.

Update: 2024-05-03 05:47 GMT

Congress: రాయ్‌బరేలీ నుండి రాహుల్, అమేథీ నుండి కేఎల్ శర్మ.. మరోసారి పోటీకి దూరంగా ప్రియాంక...

Congress: గాంధీ కుటుంబానికి పట్టున్న రెండు నియోజకవర్గాల్లో పోటీపై స్పష్టత వచ్చింది. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరి లాల్ శర్మను అభ్యర్ధులుగా ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు ఈనెల 20న పోలింగ్ జరగనున్నది. ఇవాళ నామినేషన్ కు చివరి రోజు కాగా.. కొన్ని గంటల ముందు అభ్యర్ధులను ప్రకటించి హస్తం పార్టీ తెరదించింది. కాసేపట్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందు కోసం పార్టీ శ్రేణులు రాయ్ బరేలీలో ఏర్పాట్లు చేస్తున్నారు.

రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. అమేథిలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరాని చేతిలో ఓటమి పాలయ్యారు. అదే ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇది ఇలా ఉంటే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయ్యింది. సోనియా స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని ఊహగానాలు వచ్చినప్పటికీ చివరకు రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం నుంచిత ఉప ఎన్నిక సహా ఐదు సార్లు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక అమేథి నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్.శర్మను ఆమేధి నుంచి బరిలోకి దించారు.

రాయ్‌బరేలీ, అమేథీ లోక్ సభ స్థానాల విషయంలో కాంగ్రెస్ లో పెద్ద హైడ్రామనే నడిచింది. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.. అమేథీ, రాయ్‌బరేలీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. అసలు ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా.. లేదా అన్న సస్పెన్స్ కొనసాగింది. రాహుల్ గాంధీ సైతం మొదటి నుంచి ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిరాసక్తత కనబరుస్తూ వచ్చారు. అయినా రాహుల్ అమేథీ నుంచి.. ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి కిషోర్ లాల్ శర్మను అభ్యర్ధులుగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ప్రియాంకా గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరం అయ్యారు. 

Tags:    

Similar News