Coronavirus Live Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..నిన్న ఒక్కరోజే 230మందికిపైగా నిర్ధారణ

Update: 2020-03-31 07:00 GMT
Live Updates - Page 2
2020-03-31 08:34 GMT

Coronavirus: కరోనా తొలి పేషెంట్ ను గుర్తించిన చైనా

ప్రపంచంలో కరోనా వైరస్​ సోకిన మొదటి బాధితురాలిని గుర్తించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మూల బిందువుని గుర్తించారు. చైనాలోని వూహాన్ లో సీమార్కెట్ లో రొయ్యలు అమ్ముకుని జీవించే 57 ఏళ్ల మహిళను '​ పేషెంట్ జీరో'గా గుర్తించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ జరిపిన పరిశోధనలో తేలింది.-పూర్తి కథనం 

2020-03-31 08:33 GMT

అమెరికాలో కోరలు చాస్తున్న కరోనా.. 3,000 దాటిన మృత్యుల సంఖ్య

కరోనా అమెరికాను గడగడలాడిస్తోంది. స్పీడ్ గా పెరుగతోన్న పాజిటివ్ కేసులు అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో వైరస్‌తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 3017కు పెరిగింది.-పూర్తి కథనం  

2020-03-31 08:32 GMT

ఢిల్లీ, నిజాముద్దీన్ లోని 'మర్కజ్' ఇన్చార్జిపై ఎఫ్ఐఆర్ నమోదు

ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన ఒక మత కార్యక్రమం దేశ వ్యాప్తంగా కరోనా బాధితులు సంఖ్య పెరగడానికి ముఖ్య కారణమైంది. దీంతో 'ఆలమీ మర్కజ్' అనే మసీదు పేరు దేశవ్వాప్తంగా మారుమోగిపోతుంది. ఈ మసీదు ప్రాంగణంలో నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమానికి మనదేశం నుంచి మాత్రమే కాకుండా ఇండోనేషియా, మలేసియా, కిర్గిజ్ స్థాన్ వంటి దేశాల నుంచి కూడా వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.-పూర్తి కథనం  

2020-03-31 08:31 GMT

నిజాముద్దీన్‌ అలజడి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ఇప్పుడు ప్రభుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్య‌లో తెలుగువారు వెల్లిన‌ట్టు తెలియ‌డంతో అధికారులు అల‌ర్టయ్యారు.-పూర్తి కథనం  

2020-03-31 08:29 GMT

కరోనా మృతులు ఏ మతం వారైనా.. అంత్యక్రియలు ఆ పద్ధతిలోనే..

దేశంలో గంటగంటకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 30 మంది మరణించి తెలంగాణలోనూ ఆరుగురు బలయ్యారు.-పూర్తి కథనం 

2020-03-31 08:27 GMT

ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.-పూర్తి కథనం  

2020-03-31 08:26 GMT

పోలీసుల వలయంలో హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం!

దేశ రాజధాని ఢిల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీల్లోని 'ఆలమీ మర్కజ్' మసీదులో మత ప్రార్థనలు జరగాయి.-పూర్తి కథనం 

2020-03-31 07:54 GMT

ఢిల్లీకి ఏపీ నుంచి 369 మంది.. ఏపీలో 17 కొత్త కేసులు ఎక్కడెక్కడంటే?

ఏపీలో నిన్న రాత్రి 9గంటల నుంచి ఒక్కసారిగా 17 కొత్త కేసులు నమోదుకావడం చర్చనీయాంశమైంది. బాధితుల్లో దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే ఎక్కువమంది ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.-పూర్తి కథనం 

Tags:    

Similar News