పోలీసుల వలయంలో హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం!

పోలీసుల వలయంలో హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం!
x
Representational Image
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీల్లోని 'ఆలమీ మర్కజ్' మసీదులో మత ప్రార్థనలు జరగాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఇతన దేశాల నుంచే కాకుండా, భారత దేశంల నలుమూలల నుంచి వచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఈ మత ప్రార్థనలకు వచ్చిన వారే కారణం అయ్యారన్న కారణంతో మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించారు.

ఈప్రార్థలనల్లో వచ్చిన వారి విరాలను పూర్తిగా వెల్లడించాలని కోరినప్పటికీ మౌలానా వెల్లడించలేదని ఆరోపించారు. ఇక పోతే ఈ ప్రార్థనలకు వచ్చిన వారే కోవిడ్ 19 ను అంటించుకుని వారి వారి స్వస్థలాలకు వెల్లారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కాంటాక్ట్ కేసులన్నీ ఢిల్లీనుంచి వెల్లిన వారి వల్లనే అని సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, ఢిల్లీ జాయింట్ సీపీ డీసీ శ్రీవాత్సవ నేతృత్వంలోని టీమ్, నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లారు.

మత ప్రార్థనలు జరిగిన ప్రాంతంలోని రెండు కాలనీల్లో హౌస్ - టూ - హౌస్ మ్యాపింగ్ చేసారు. మసీదుకి సమీపంలో ఉన్న కొన్ని వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారిని గుర్తించి క్వారంటైన్ లోకి పంపించే పనిలో పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీమ్ సహాయంతో సుమారుగా 1200 మందిని క్వారంటన్ లోకి పంపించి, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రావణాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుభ్రం చేస్తున్నారన్నారు. ఇందులో పోలీసులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారన్నారు. ఢిల్లీలో ఉన్న పరిస్థితులను గమనించిన ప్రభుత్వం "మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించారని అధికారులు తెలిపారు.

లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఇంటి యజమాని, గెస్ట్ హౌస్, హాస్టల్ అడ్మినిస్ట్రేటర్, లాడ్జిలు దగ్గర సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు తెలిపారు. కానీ అక్కడి ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తుందని షల్ డిస్టెన్స్ ను పాటించడం లేద అని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలను పాటించనందుకే కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఈ ప్రాంతంలో అధికంగా ఉందని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. తొలి పాజిటివ్ కేసు రాగానే, నిజాముద్దీన్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని తెలిపింది. ఇక నిజాముద్దీన్ మర్కజ్ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ షోయబ్ ప్రభుత్వం అడిగినట్లుగా తాము ప్రార్థనలకు వచ్చిన వారి జాబితాను అందించామని వెల్లడించారు. ప్రార్థనలకు వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీని కూడా ఆదివారం అందించామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories