Haryana: బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

Haryana: ప్రమాదంలో మరో 24 మందికి గాయాలు

Update: 2024-05-18 08:21 GMT

Haryana: బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు వెళ్లి వస్తోన్న బస్సులో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. కుండ్లీ, మనేసర్, పల్వార్ ఎక్స్‌ప్రెస్ వేపై అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఛండీగఢ్, పంజాబ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Tags:    

Similar News