Mamata Banerjee: లాయర్ అవతారంలో మమతా బెనర్జీ.. సుప్రీంకోర్టులో స్వయంగా వాదించనున్న సీఎం దీదీ!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2026-02-04 06:46 GMT

Mamata Banerjee: లాయర్ అవతారంలో మమతా బెనర్జీ.. సుప్రీంకోర్టులో స్వయంగా వాదించనున్న సీఎం దీదీ!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పోరాటాల్లో నిత్యం ముందుండే ఆమె, ఇప్పుడు న్యాయపోరాటంలో స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో స్వయంగా న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్ణయానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను నేడు విచారించనుంది. ఈ సందర్భంగా తన తరఫున ఎవరినో నియమించకుండా, స్వయంగా తన వాదనలను ధర్మాసనానికి వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు.

కోల్‌కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందిన మమతా బెనర్జీకి లాయర్‌గా అర్హత ఉంది. తన కేసును స్వయంగా వాదించుకునేందుకు (Party-in-person) ఆమె సుప్రీంకోర్టు అనుమతి కోరారు. సాధారణంగా ప్రముఖ న్యాయవాదుల సలహాలు తీసుకునే సీఎంలు, ఇలా నేరుగా కోర్టు గదిలో వాదించబోతుండటం ఇదే ప్రథమం.

ఎన్నికల సంఘం తీరుపై మమతా బెనర్జీ గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ మరియు ఇతర ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులోనే ఈ అంశాలను ఎండగట్టాలని ఆమె భావిస్తున్నారు. ఈ అరుదైన పరిణామంపై దేశవ్యాప్తంగా న్యాయ మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News