Anurag Thakur: ఎంపీ స్వాతిపై దాడి ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
Anurag Thakur: ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం విచారకరం
Anurag Thakur: ఎంపీ స్వాతిపై దాడి ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
Anurag Thakur: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఘటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా సీఎం కేజ్రీవాల్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత కూడా నిందితుడిని తన వెంటే తిప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించే బాధ్యత కేజ్రీవాల్‌పై ఉందని అనురాగ్ అన్నారు. స్వయంగా సీఎం ఇంట్లోనే ఓ మహిళా ఎంపీపై దాడి జరగడం విచారకరమని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు.