Unemployment Allowance: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఖాతాల్లోకి రూ. 1500 భృతి..!
Unemployment Allowance: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చారు.
Unemployment Allowance: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఖాతాల్లోకి రూ. 1500 భృతి..!
Unemployment Allowance: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో 'యువ సాథి' (Yuva Sathi) అనే సరికొత్త పథకాన్ని ఆమె శనివారం ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 1500 చొప్పున నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు వెల్లడించారు.
మహిళా దినోత్సవం కానుకగా..
వాస్తవానికి ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, మార్చి 8న 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' ఉన్నందున ఒక రోజు ముందుగానే అంటే నేటి నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిర్వహించిన ధర్నాలో ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు.
అర్హతలు మరియు పథకం ఉద్దేశం:
వయోపరిమితి: 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు.
విద్యార్హత: కనీసం పదో తరగతి పాసై ఉండాలి.
ఈ ఆర్థిక సాయంతో యువత తమ స్వయం సమృద్ధిగల భవిష్యత్తు వైపు అడుగులు వేయగలరని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నిరుద్యోగం 40 శాతం తగ్గుదల:
తమ పాలనలో బెంగాల్‌లో నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గిందని సీఎం తెలిపారు. "గడిచిన కొన్నేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం తగ్గింది. దాదాపు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం, అందులో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందారు" అని ఆమె వివరించారు. అలాగే రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే నెలకు రూ. 10,000 ఇస్తున్నామని, రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మమత పేర్కొన్నారు.