రెండుసార్లు ఫోన్లు పోయాయని..తండ్రిని ఇబ్బంది పెట్టలేక..రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
Hyderabad: బోరబండ రాజనగర్ నివాసి చుక్కా శ్రీనివాస్ పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో వార్డుబాయ్ గా పనిచేస్తున్నాడు
రెండుసార్లు ఫోన్లు పోయాయని..తండ్రిని ఇబ్బంది పెట్టలేక..రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
Hyderabad: అన్నా.. అమ్మానాన్న ను బాగా చూసుకో అంటూ సోదరుడికి ఫోన్ చేసిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. బోరబండ రాజనగర్ నివాసి చుక్కా శ్రీనివాస్ పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో వార్డుబాయ్ గా పనిచేస్తున్నాడు. అతని రెండో కుమారుడు చుక్కా సాయికుమార్ బిగ్ బాస్కెట్లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. నెల రోజుల కిందట సాయికుమార్ కృష్ణకాంత్ పార్కుకు వెళ్లిన సమయంలో తన సెల్ఫోన్ పోయింది. ఈఎంఐ పద్దతిలో 28 వేల విలువజేసే మరో ఫోన్ను తండ్రి ఇప్పించాడు.
రెండోసారి ఫోన్ పోవడంతో సాయికుమార్ తన స్నేహితులతో చెప్పి బాధపడ్డాడు. మిత్రులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన సెల్ ఫోన్ పోయిందని అక్కడి పోలీసు సిబ్బందికి చెప్పాడు. అక్కడి సిబ్బంది ఈ-సేవ కేంద్రంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో మిత్రులతో కలిసి ఈ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి, తిరిగి ఇంటికి వెళ్లిపోయ
తరువాత సాయికుమార్ తండ్రికి ఫోన్ వచ్చింది. తుకారాంగేట్ రైల్వేట్రాక్ వద్ద రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అతడి మృతదేహం రెండు ముక్కలు అయ్యింది.. వచ్చి గుర్తించాలని రైల్వే పోలీసులు సూచించారు. దీంతో శ్రీనివాస్ హుటాహుటిన గాంధీ దవాఖాన మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని చూసి.. చనిపోయింది తన కుమారుడేనని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.