Danam Nagender: ఖైరతాబాద్‌లో ఎవరైన చైనా మాంజాను పట్టిస్తే రూ.5 వేలు ఇస్తా

Danam Nagender: చైనా మాంజా పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2025 2:18 PM IST
Danam Nagender: ఖైరతాబాద్‌లో ఎవరైన చైనా మాంజాను పట్టిస్తే రూ.5 వేలు ఇస్తా
X

Danam Nagender: చైనా మాంజా పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుంచి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story