Sridhar Babu: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక సూచనలు
Sridhar Babu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Sridhar Babu: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక సూచనలు
Sridhar Babu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో చర్చలు అర్థవంతంగా, హుందాగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
సభలో ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు ఇలా అన్నారు.."ప్రభుత్వ పక్షాన మాకు ఎటువంటి బేషాజాలు లేవు. ప్రతిపక్ష సభ్యుల పట్ల మేము ఎప్పుడూ మర్యాదపూర్వకంగానే ఉంటాం. సభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం."ప్రజాస్వామ్య దేవాలయంలో సభ్యులందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని, అప్పుడే సభ హుందాతనం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో సాగుతున్న వాదోపవాదాల నేపథ్యంలో మంత్రి ప్రతిపక్షానికి కొన్ని సూచనలు చేశారు.."రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ అవి వ్యక్తిగత దూషణలకు తావివ్వకూడదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఇతరుల పట్ల గౌరవంగా ఉండాలని సూచిస్తున్నాం" అని ఆయన అన్నారు. ప్రతిపక్షం కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకమైన సూచనలతో సభకు సహకరించాలని ఆయన కోరారు.
అసెంబ్లీలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా నదీ జలాలు, ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.