Nalgonda Municipal Election Results 2026: నల్గొండలో ‘హస్తం’ నయా రికార్డు: 6 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ప్రతిపక్షాలు క్లీన్ అవుట్!

Nalgonda Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది.

Update: 2026-02-13 09:12 GMT

Nalgonda Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. చండూరు నుంచి మిర్యాలగూడ వరకు అన్ని పీఠాలపై హస్తం జెండా రెపరెపలాడింది.

మున్సిపాలిటీ

మొత్తం వార్డులు

కాంగ్రెస్ విజయం

మిర్యాలగూడ

4831

దేవరకొండ

2010

చిట్యాల

1209

హాలియా

1211

నందికొండ

1211

చండూరు

1006

జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా హాలియా, నందికొండ వంటి చోట్ల కాంగ్రెస్ కేవలం ఒక్కో స్థానాన్ని మాత్రమే ప్రత్యర్థులకు వదిలిపెట్టి మిగిలినవన్నీ గెలుచుకోవడం విశేషం. మిర్యాలగూడలో 31 వార్డులను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ఈ విజయంతో జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ, రంగులు చల్లుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News