Hyderabad: తప్పిన పెను ప్రమాదం.. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SYR కన్వెన్షన్ హాల్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Meerpet: తప్పిన పెను ప్రమాదం.. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
Meerpet: హైదరాబాద్ మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SYR కన్వెన్షన్ హాల్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఎండిపోయిన చెట్లు, చెత్త కుప్పలు అధికంగా పేరుకుపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
మంటలు వేగంగా వ్యాపించినప్పటికీ, సమీపంలో ఉన్న కన్వెన్షన్ హాల్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడం అదృష్టకరమని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇకపై ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బడంగ్‌పేట్ సర్కిల్‌కు సంబంధించిన మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.