Hyderabad: లిటిల్ ఫ్లవర్ కాలేజీలో విద్యార్థినిపై వేధింపులు తల్లి ఆవేదన

Hyderabad: ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీ వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాధిత విద్యార్థిని తల్లి దీప్తి ఆరోపించారు.

Update: 2026-04-03 16:00 GMT

Hyderabad: లిటిల్ ఫ్లవర్ కాలేజీలో విద్యార్థినిపై వేధింపులు తల్లి ఆవేదన

Hyderabad: తన కూతురుని తోటి విద్యార్థుల ముందు దూషించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా మానసికంగా వేదించిన ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లి దీప్తి పోలీసులను కోరింది.

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మానవ హక్కుల సంఘం నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న తన కూతురు అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా కాలేజీకి వెళ్లలేదని తెలిపింది. అటెండెన్స్ తక్కువ ఉందని కారనంతో ఎగ్జామ్స్ కు అనుమతించలేదని వాపోయింది.

కాలేజీ యాజమాన్యానికి మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినా తమను దూషించి అవమానపరిచారని ఆరోపించారు. తమ కూతురుని ఇబ్బంది పెట్టకుండా హాల్ టికెట్ ఇచ్చి పరీక్ష సజావుగా రాయని ఇవ్వాలని, తమను అవమానించిన కాలేజీ యాజమాన్యం క్షమాపణల డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా ము కట్టిన ఫీజు తమకు తిరిగి చెల్లించాలన్నారు. ఈ విషయంపై గత నెల 28న ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా పట్టించుకోలేదని ఆరోపించారు.మా సమస్య ఇలా వుంటే ఒక్క పార్టీ పేరుతో ఒక్క వ్యక్తి వచ్చి సమస్య సర్దుమార్గిందని అందరికీ చెప్పి కాలేజీతో కుమక్కు అయినాడాని తెలిపారు..

Tags:    

Similar News