Bandarupalli: బండారుపల్లిలో విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి

Bandarupalli: సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో విషాదం. హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళ్లిన దోసాని నరేష్ (32) గుండెపోటుతో మృతి చెందారు.

Update: 2026-04-03 14:39 GMT

Bandarupalli: బండారుపల్లిలో విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి

Bandarupalli: సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని బండారుపల్లి గ్రామంలో గురువారం రాత్రి హనుమాన్ జయంతి విజయోత్సవ ర్యాలీ పాల్గొని ఇంటికి వెళ్లిన దోసాని నరేష్ (32) గుండెపోటుతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులు తెలిపారు గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. నరేష్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా విషయం తెలుసుకున్నాం గ్రామ సర్పంచ్ కోల వెంకట్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి. భౌతిగానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి గ్రామం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామస్తుల తరఫున బాధిత కుటుంబానికి రూ 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.నరేష్ మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో కోల శ్రీనివాస్ గౌడ్, బుడగం పరమేశ్వర్ రెడ్డి, కోల శ్రీకాంత్, రేబర్తి మహేందర్, మేడల కిరణ్ రెడ్డి. మజ్జిగ వెంకట్ రెడ్డి. ముత్యాలు నర్సింలు జాలిగామ నవీన్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News